మాసాంతపు చదువుల పండుగను పాఠశాలలో 29 సెప్టెంబరు 2012 న ఘనంగా నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో పాఠశాలలో గల ఉపాధ్యాయులు 4/4 విద్యావాలంటీర్లు 2/2 విద్యార్ధులు 100/104 హాజరయ్యారు. ఈ సంధర్భంగా క్రింది అంశాలను గూర్చి విద్యార్ధుల తల్లిదండ్రులతో కలసి చర్చించడమైనది.
- విద్యార్ధుల ప్రగతి ప్రదర్శన-వారి తల్లిదండ్రుల ముందు
- ఉపాధ్యాయుల హాజరు మరియు విద్యార్ధుల హాజరు, గైర్హాజరైన విద్యార్ధులు-అందుకు కారణాలు
- మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ-అమలు తీరు-మెనూ పై చర్చ్-సంతృప్తి
- పాఠశాలకు మంజూరి అయిన నిధులు, వాటి వినియోగం పై చర్చ్
- జవహర్ బాల అరోగ్య రక్ష పథకం-విద్యార్ధుల అరోగ్య పరీక్షలపై చర్చ్
- టాయిలెట్ వినియోగం,పాఠశాల నందు పచ్చదనం,పరిశుభ్రత పై చర్చ్
- విద్యార్ధులకు నిర్వహించిన మంచి దస్తూరి,గాంధీ జీవితం పై వ్యాసరచన,వకృత్వ పోటీల విజేతలకు మరియు పాటల పోటీల యందు, రైమ్స్ యందు గెలుపొందిని విద్యార్ధులకు బహుమతి ప్రధానం
- నవోదయకు పాఠశాల నందు పనివేళల అనంతరం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల గూర్చి
- ఈ విద్యా సంవత్స్రంలో పాఠశాల విద్యార్ధులకు దాతల నుండి అందజేసిన వివరాలు
- లలిత చంద్రశేఖర్ -4000 రూపాయలు విలువగల పుస్తకాలు
- శాంతేస్వర బాబా-పదిమంది విద్యర్ధులకు స్కూల్ బ్యాగులు అందజేశారు
- కందుకూరి రాముగారు-ప్రార్ధన సమయంలో విద్యార్ధులకు చెప్పవలసిన సూక్తులు పర్యావరణ అంశల పుస్తకాలను అందజేశారు
- చిన్మయామిషన్-పాఠశాల విద్యార్ధులందరికీ నోట్ పుస్తకాలు పంచారు
- ఎస్.ఢిల్లీ,జి.బాబూరావు టీచర్లు-స్కూల్ విద్యార్ధులకై ప్యాన్ మరియు వాటర్ డ్రమ్ అందజేశారు
- యడ్ల భాస్కరరావు[ఆపరేషన్ ఫర్ హెల్ప్ లెస్]-విద్యార్ధులకు అట్టలు,నోట్ బుక్స్ అందజేశారు
- పై అంశల గూర్చి విద్యార్ధుల తల్లిదండ్రులతో సవివరంగా మధ్యాహ్న 2 గంటల నుండి 4 గంటల వరకు విజయవంతంగా నిర్వహించడమైనది.