ఘనం గా చదువుల పండుగు సమావేశం నిర్వహణ -వివేకానంద విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం


ఘనం గా చదువుల పండుగు సమావేశం నిర్వహణ -వివేకానంద విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం 
నేడు స్థానిక రామకృష్ణాపురం ప్రాథమికోన్నత పాఠశాల నందు మాసంతపు చదువుల పండుగను ప్రధాన ఉపాధ్యాయులు బెహరా వేణుగోపాలరావు అధ్యక్ష్యతన ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశం నందు  పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధులు , వివేకానంద యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో  పాఠశాల స్థాయి,విద్యార్ధుల విద్యా స్థాయి, మధ్యాహ్న భోజన పధకం అమలు తీరు, బాల ఆరోగ్యరాక్ష పథకం అమలు విధానం,నిరంతర సమగ్ర మూల్యాంకనం పధకం అమలులో భాగంగా  పాఠశాల నందు చేపడుతున్న విద్యా సంభందిత కార్యక్రమాలను గూర్చి చర్చించారు. అనతరం  పాఠశాల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో  పాఠశాల నందు స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. గ్రామ పెద్ద  బ్రహ్మానందం పట్నాయక్ పాఠశాల కు  ఒక ఫ్యాన్[పంఖా] ను బహుకరించడానికి అంగీకరించారు.
ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ధనరాజు,నాగాసిరీశ,జయంతి,  కాంప్లెక్స్ రిసోర్స్ పెర్సన్ శ్రీనివాసరావు ఉమాపతి 
విద్యార్ధుల తల్లిదండ్రులు లవరాజు,లోకనాధం, ఊర్వశి,ఉషారాణి,జయంతి,తదితరు 50 మంది తల్లిదండ్రులు  వరకు పాల్గొన్నారు, అనతరం తరగతి అత్యుత్తమ ప్రతిభ కనబరచిన  తరగతి  వారీగా మొదటి రెండు స్థానాలు సాధించిన విద్యార్ధులకు   బ్యాడజీలను  అందజేశారు