మాసాంతపు చదువుల పండుగ

మండల పరిషత్  ప్రాథమికోన్నత పాఠశాల, రామక్రిష్ణాపురం నందు మాసాంతపు చదువుల పండుగను 29 సెప్టెంబర్ అనగా శనివారం మధ్యాహ్నం 1గంటకు నిర్వహించడానికి నిశ్చయించాము.
ఈ రోజు విద్యార్ధుల తల్లిదండ్రులతో విద్యార్ధుల ప్రగతి, పాఠశాల అమలు జరుగుచున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు,విద్యార్ధుల హాజరు, పాఠశాల అభివృధ్ధికి చేపట్టవలసిన చర్యలు గూర్చి చర్చించడం జరుగుతుంది.